This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్​లో గడ్డ.. ఎప్పుడు సీరియస్‌గా తీసుకుని వైద్యుడిని సంప్రదించాలి? (Breast Lump During Pregnancy - When to Meet Doctor in Telugu?)

Breast Lump
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్​లో గడ్డ.. ఎప్పుడు సీరియస్‌గా తీసుకుని వైద్యుడిని సంప్రదించాలి? (Breast Lump During Pregnancy - When to Meet Doctor in Telugu?)
Likes6 Likes|
Read time11 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ముల్లో గడ్డలు రావడం చాలా సాధారణం. మీ శరీరం పాల ఉత్పత్తికి సిద్ధమవుతున్న సంకేతంగా సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్‌లో ఇవి కనిపిస్తాయి.
  • క్లాగ్డ్ డక్ట్స్, ఎంగోర్జ్‌డ్ బ్రెస్ట్స్, మాస్టైటిస్, గెలాక్టోసెల్స్, ఫైబ్రోడెనోమా వంటి అనేక రకాల రొమ్ము గడ్డలు ప్రెగ్నెన్సీ సమయంలో రావచ్చు. చాలావరకు ఇవి ప్రాణాంతకమైనవి కావు.
  • వెచ్చని కంప్రెస్, మృదువైన మసాజ్, రెగ్యులర్ ఫీడింగ్, సరైన సపోర్టివ్ బ్రా ధరించడం వంటి జాగ్రత్తలతో గడ్డలు తగ్గుతాయి. అండర్‌వైర్ బ్రాలు తప్పనిసరిగా దూరంగా ఉంచాలి.
  • రొమ్ముల సంరక్షణ కోసం ఏ ఉత్పత్తులు ఉపయోగపడతాయి? Explore our Bra Extenders (White) - Pack of 3.
Bra Extenders (White) - Pack of 3
Bra Extenders (White) - Pack of 3
Rating4.3
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Compression Stocking Socks - S
Compression Stocking Socks - S
Rating4.5

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే రొమ్ము గడ్డ అనేది బ్రెస్ట్ క్యాన్సర్​కు సంకేతమని, అందువల్ల దీనిని విస్మరించకూడదని చాలా మంది అనడం మీరు విని ఉంటారు. అందువల్ల ఇలాంటి గడ్డలు ఏ దశలోనైనా రొమ్ముల్లో కనిపిస్తే ఏ స్త్రీకైనా భయం కలుగుతుంది. కానీ రొమ్ము గడ్డ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ లంప్ అనేది అరుదుగా బ్రెస్ట్ క్యాన్సర్​కు సంకేతం. అన్నింటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది... గర్భిణీ స్త్రీలలో 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా అరుదు. ప్రెగ్నెన్సీ సమయంలో మీ శరీరం అనేక మార్పులకు గురవుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతోంది. ఆ సమయంలో మీ రొమ్ముల్లో కూడా మార్పులు వస్తాయి. అవీ మరింత హెవీగా, గడ్డల వలే మారుతాయి. ఎందుకంటే పాల ఉత్పత్తికి తమను తాము సిద్ధం చేసుకుంటాయి.. కావున వాటిల్లో మార్పులు సహజం. నిజానికి సెకండ్ లేదా థర్డ్ ట్రైమెస్టర్​లో బ్రెస్ట్ లంప్స్ అనేవి ఎక్కువగా నాళాల్లో పాలు గడ్డ కట్టడం వల్ల వచ్చేవే.

ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ముల్లో గడ్డ అంటే ఏమిటి? (What is Breast Lump During Pregnancy in Telugu?)

ప్రకృతి ఒక క్రమపద్ధతిలో పనిచేస్తుంది. పుట్టిన తర్వాత మీ బిడ్డ న్యూట్రిషన్, విటమిన్ల కోసం తల్లి పాల మీదనే ఆధారపడుతుంది. మీరు సెకండ్ ట్రైమెస్టర్​లో ఉన్నపుడే మీ రొమ్ములు తమను తాము సిద్ధం చేసుకోవడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో మిల్క్ డక్ట్ (పాలవాహిక) మూసుకుపోవడం, పెద్దగా కావడం చాలా కామన్. ఈ అడ్డు పడే పాలనాళాలు చాలా హార్డ్​గా ఎరుపు రంగు గడ్డలవలే కనిపిస్తాయి. వీటిని తాకినపుడు నొప్పిగా ఉంటాయి. మీ శరీరం మీకు పుట్టబోయే చిన్నారికి పాలిచ్చేందుకు సిద్ధం అవుతోందని చెప్పేందుకు ఇవి చిహ్నం. అంతే కాకుండా ఈ గడ్డలు కొన్ని రోజుల తర్వాత కనబడకుండా పోతాయి. మీకు ఫ్యూచర్​లో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండేందుకు మీరు మీ బిడ్డకు రొమ్ము పాలు ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది వైద్యులు సూచిస్తున్నారు.

బ్రెస్ట్ లంప్​ (గడ్డ)ను గుర్తించేందుకు ఉత్తమ మార్గం ఏమిటి? (What is The Best Way to Recognise Breast Lump in Telugu?)

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెప్పిన వివరాల ప్రకారం.. సగటు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఉన్న మహిళలకు రొటీన్ సెల్ఫ్ పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ప్రెగ్నెంట్ లేడీస్ వారి రొమ్ముల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలి. వారి రొమ్ముల్లో తలెత్తే అసాధారణ విషయాల గురించి వారి వైద్యుడికి తెలపడం మంచిది. మీరు మీ రొమ్ములను నిశితంగా గమనిస్తుంటే మీ శరీరంలో ఏది నార్మలో ఏది కాదో ఇట్టే తెలిసిపోతుంది. మీరు మీ రొమ్ముల్లో గడ్డల కోసం చెక్ చేస్తున్నపుడు ప్రాణాంతక గడ్డలు ఫామ్ అయి ఉంటే అవి మొదట్లో ఎర్రగా లేదా పెయిన్​ఫుల్​గా ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే అవి గోరువెచ్చని నీటితో లేదా మసాజ్ చేసినా కూడా క్లియర్ కావు. ఏవైనా కొత్తగడ్డలు గుర్తించి, చర్మం థిక్​నెస్ అవడం, చర్మం గట్టిపడడం, ఎరుపు రంగులోకి మారడం, ఒకే ప్లేస్‌లో నొప్పి ఏర్పడడం వంటి వాటిని గమనించినట్లయితే అవి మీ వైద్యుడికి వివరించాలి. మీరు ప్రెగ్నెన్సీ టైమ్​లో ఉన్నప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వొచ్చు. అందువల్ల మీరు డాక్టర్​కు చూపించుకునేందుకు డెలివరీ వరకు వెయిట్ చేయకండి. ప్రస్తుతం మీ రొమ్ము అనేది చాలా గట్టిగా మరియు గడ్డలాగ ఉండడం వలన క్యాన్సర్ పరీక్ష చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సరైన రోగనిర్ధారణ చేసుకునేందుకు వీలవుతంది.

మీరు బ్రెస్ట్ లంప్​ని కనుక గుర్తిస్తే ఫాలో కావాల్సిన టిప్స్ (Tips to Follow If You See Breast Lump in Telugu)

ఒక మహిళ ప్రెగ్నెన్సీ రొమ్ము గడ్డను తన రొమ్ముల్లో గుర్తిస్తే తను వీలైనంత తొందరగా కింది నియమాలను పాటించాల్సి ఉంటుంది.

  1. మీరు కనుక పాలిచ్చే తల్లులైతే మీకు ఏర్పడిన గడ్డ వెంటనే ఉబ్బిపోయి.. మీరు పాలివ్వకుండా ఉండొచ్చు. చికిత్స కోసం మీరు నర్సింగ్​కు వెళ్లే ముందు మీరు ఆ గడ్డను వేడి నీటితో కంప్రెస్ చేయండి. లేదా వేడి నీటితో స్నానం లేదా వేడి షవర్ అయినా చేయండి.
  2. వేడి నీటితో స్నానం చేసిన తర్వాత.. గడ్డ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సున్నితంగా రుద్దండి. మీ అరచేతులతో పాలను వదలండి. మసాజ్ తర్వాత గడ్డ మృదువుగా అయితే మీ బిడ్డకు రొమ్ము పాలిచ్చేందుకు ట్రై చేయండి. లేకపోతే అలాగే మసాజ్ చేయండి.
  3. మీరు మీ శిశువుకు క్రమం తప్పకుండా పాలు ఇస్తే పాలనాళాలు మూసుకుపోకుండా ఉంటాయి. అందుకే రెగ్యులర్​గా పాలు ఇవ్వండి.
  4. మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే ఎక్కువగా ద్రవాలు తాగడం ద్వారా హైడ్రేటెడ్​గా ఉండేందుకు ప్రయత్నించండి.
  5. మీ బ్రా టైట్​గా ఉండడం కూడా గడ్డలు ఏర్పడేందుకు కారణం కావొచ్చు. మీ రొమ్ములకు సపోర్ట్ ఇచ్చే బ్రాను ధరించాలి. అతి టైట్​గా ఉండే బ్రాను కాదు. అండర్​వైర్డ్ బ్రాలను తప్పకుండా విస్మరించాలి. ఎందుకంటే అవి పాలనాళాలు (మిల్క్ డక్ట్స్) మీద ఒత్తిడిని పెంచుతాయి.
  6. మీరు ఎలా పాలివ్వాలో తెలుసుకోవడం కోసం నిపుణుడిని అడగండి.
  7. ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ లంప్ అనేది 3 నుంచి 4 రోజులలో తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీరు మీ రొమ్ముపాలలో చీము లేదా నెత్తురును గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  8. క్యాన్సర్ రాకుండా ఉండేందుకు గడ్డను చాలా క్షణ్ణంగా పరీక్షించాలి.
  9. గడ్డ అనేది తిత్తి లేదా కణతా? అనే విషయం తెలుసుకోండి.
  10. ఇది తిత్తా? లేదా కణతా? అనే విషయాన్ని గుర్తించడం కోసం ఆటోస్పి పరీక్షను చేయించుకోండి.
  11. మీ గడ్డ క్యాన్సర్ అని మీరు కనుక్కుంటే చికిత్స ఎంపికల గురించి తెలుసుకోవడం కోసం మీరు సమయం కేటాయించండి. ఉత్తమ వైద్యులను గురించి తెలుసుకునేందుకు మీకు తెలిసిన వ్యక్తులతో కూడా మాట్లాడండి.
  12. మీరు సందర్శించిన సమయంలో మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అంకాలజిస్ట్ సిద్జంగా ఉంటారు.
  13. డీప్ బ్రీత్ తీసుకోండి. అన్ని సమయాల్లో సానుకూల భావనతో ఉండండి.

ప్రెగ్నెన్సీ సమయంలో మీరు రొమ్ముల్లో గడ్డను కనుగొంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? (Treatment Options for Breast Lump During Pregnancy in Telugu?)

ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ లంప్​ను గుర్తిస్తే వెంటనే డాక్టర్​ వద్దకు వెళ్లాలి. గడ్డ యొక్క సైజు మురియు అది ఏర్పడిన ప్రాంతాన్ని బట్టి అల్ట్రాసౌండ్ లేదా మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (MRI) వంటి అదనపు పరీక్షలను మీ వైద్యుడు సూచించవచ్చు. మీ గడ్డ అనేది క్లాగ్డ్ డక్ట్ వలన ఏర్పడితే వేడి కంప్రెస్ (లేదా వేడినీటితో స్నానం లేదా వేడి షవర్) ఉపయోగించి ఆ ప్రాంతంలో మసాజ్ చేయడం వలన రిలీఫ్​గా ఉంటుంది. గడ్డ అలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారకముందే మీ వైద్యుడి వద్ద అపాయింట్​మెంట్ తీసుకోండి. రొమ్ము గడ్డల్లోని రకాలు. ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ముల్లో వచ్చే గడ్డల్లో కొన్ని రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

చీము పట్టిన గడ్డలు (ఎంగోర్జ్‌డ్ బ్రెస్ట్స్) (Engorged Breasts)

బ్రెస్ట్ ఎంగోర్జ్‌ అనేది రొమ్ములలో చాలా బాధాకరమైన గడ్డలను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా మంది తల్లులలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇది రొమ్ముల వాపు, కఠినత్వానికి దారి తీయొచ్చు. పాలను చేతులతో లేదా మిషన్​తో (పంప్​తో) ఖాళీ చేసినపుడు ఈ గడ్డలు అదృశ్యమవుతాయి. బేబీ క్లియర్​గా పాలు తాగలేకపోవడం వలన పాలు రావడం ఆగిపోతాయి. ఇటువంటి సందర్భాల్లో గెలాక్టాగోగ్​లు మరియు ప్రత్యామ్నాయ టాప్​ ఫీడ్​లను ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ సాయం చేస్తాయి.

ప్లగ్డ్ డక్ట్స్ ( Blocked Ducts)

రొమ్ములో పాలు ఒక ప్రాంతంలో నిలిచిపోవచ్చు. ఇన్​కరెక్ట్ ఫీడింగ్ పొజిషన్ వలన ఈ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. చాలా బిగుతుగా ఉండే బ్రాలు నాళాలు మూసుకుపోయేందుకు దారితీయొచ్చు. బ్రెస్ట్ పంప్​ను తరుచుగా ఉపయోగించడం కూడా బిడ్డ పుట్టిన మొదటి నెలలో వాహిక అడ్డంకికి కారణం కావొచ్చు.

మాస్టైటిస్ (Mastitis)

మాస్టైటిస్ అనేది ఇన్ఫెక్షన్ వలన రొమ్ములో ఏర్పడే పెయిన్​ఫుల్, అసౌకర్యవంతమైన గడ్డ. దీనికి కనుక మీరు చికిత్స చేయకపోతే పాలు రొమ్ముల వెనకాల పేరుకుపోతాయి. చికాకు వలన సాధారణంగా జ్వరం వస్తుంది.

గెలాక్టోసెల్స్ (మిల్క్ సిస్ట్ లేదా లాక్టిల్ సిస్ట్) (Milk Cysts or Lactil Cysts)

పాలు బ్లాక్ కావడం వలన సిస్ట్ (తిత్తి) అనేది పాలు మరియు పాలకు సంబంధించిన ఇతర రసాయనాలను సేకరిస్తుంది. చాలా సందర్భాలలో ఇది ఎటువంటి అనారోగ్యాలకు దారి తీయదు. స్త్రీ చనుబాలివ్వడం మానేసిన తర్వాత ఇది అదృశ్యమవుతుంది.

రొమ్ము పుండ్లు (Breast Abscess)

రొమ్ములలో చీము చేరడం వలన రొమ్ము పుండ్లు ఏర్పడతాయి. సరిగ్గా చికిత్స చేయని మాస్టైటిస్ వల్ల ఇది సాధారణంగా వస్తుంది. యాంటీబయాటిక్స్ ఉన్న క్యాథర్ ఆస్పిరేషన్ లేదా సూది ద్వారా గడ్డలను తొలగించాలి. వీటిని అలాగే వదిలేస్తే మరింత నొప్పిని కలిగిస్తాయి. జ్వరానికి దారి తీయొచ్చు.

ఫైబ్రోడెనోమా (Fibroadenoma)

15 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీలలో ఎటువంటి అపాయం లేని బ్రెస్ట్ ట్యూమర్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది గ్రంథి మరియు పీచుకణజాలంతో కూడిన ట్యూమర్ (కణతి). నెలవారీ రుతుచక్రంతో కూడా కొన్ని రకాల బ్రెస్ట్ లంప్స్ వస్తూ పోతూ ఉంటాయి. నెలవారీ రుతుచక్రం తర్వాత కూడా మిగిలి ఉన్న గడ్డనే ఫైబ్రోడెనోమా అని పిలుస్తారు. రుతుక్రమం ఆగిపోయిన (పీరియడ్స్ రాని స్త్రీలు) స్త్రీలు దీనిని అనుభవించే అవకాశాలు చాలా తక్కువ.

ఇంట్రాడక్టల్ పాపిల్లోమాస్ (Intraductal Papillomas)

రొమ్ముల యొక్క పాలనాళాల్లో పెరుగుదలను ఇంట్రాడక్టల్ పాపిల్లోమాస్ అని అంటారు. ఇవి ప్రాణాంతకమైనవి కావు. చనుమొన చుట్టూ ఉన్న మేజర్ పాలవాహికలో ఇంట్రాడక్టల్ పాపిల్లోమా డెవలప్ అవుతుంది. ఇది తల్లులలో అత్యంత సాధారణంగా సంభవించే క్షీర కణతి. కొంత మంది స్త్రీలలో ఇది ఒకటి కంటే ఎక్కువగా కూడా ఉంటుంది. వీటితో బాధపడే వారిలో కొంత మందికి రక్తపు ఉత్సర్గ (స్రావం) కూడా అయ్యే అవకాశం ఉంది.

లిపోమాస్ (Lipomas)

రొమ్ములలో లేదా ఇంకా ఎక్కడైనా పెరుగుతున్న కొవ్వును లిపోమా అని అంటారు. 2 సెం.మీ. వ్యాసంలో అవి పెరుగుతాయి. ఇవి గుండ్రంగా లేదా ఓవల్ ఆకారంలో ఉంటాయి. తేలికగా నొక్కినపుడు ఇవి సులభంగా కదులుతాయి. వీటిని నొక్కితే రబ్బర్ నొక్కిన ఫీలింగ్ వస్తుంది. ఏకకాలంలో ఇవి అనేకం ఏర్పడొచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer)

చాలా సందర్భాలలో ఇది అసౌకర్యాన్ని కలిగించని హార్డ్ లేదా ఫర్మ్ బంప్. నిపుల్ (చనుమొన) లేదా బ్రెస్ట్ మీద ఈ ట్యూమర్ ఏర్పడొచ్చు. పెద్ద ప్రాణాంతక ట్యూమర్స్ సమీపంలోని రొమ్ము కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. లేదా చర్మాన్ని చీలుస్తాయి. ఈ రెండూ విపరీతమైన బాధను కలుగజేస్తాయి.

ఫ్యాట్ నెక్రోసిస్ (Fat Necrosis)

ఈ గడ్డలు రొమ్ము యొక్క కొవ్వు కణజాలాలు దెబ్బతినడం వలన ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాలంపాటు కొనసాగితే వీటికి చికిత్స చేయాలి. ఇవి ప్రాణాంతకమైనవి కావు. వీటికి విజయవంతంగా చికిత్స చేయొచ్చు.

మీరు మంచి అనుభూతి చెందేందుకు ఏం చేయాలి? (What Should You Do To Feel Better?)

రొమ్ము గడ్డలు క్యాన్సర్​కు సంకేతం కానప్పటికీ.. రొమ్ము గడ్డలు నొప్పిని మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. వాటిని వదిలించుకునేందుకు రొమ్ము గడ్డలను క్రమం తప్పకుండా వెచ్చని కంప్రెస్ (పదార్థాలను ఒక చోట వేసి ముద్దలా చేసేది)తో తాపడం పెట్టాలి. మీరు ఆ గడ్డలు ఉన్న ప్రదేశాల మీద వేడి నీటిని కూడా పోయొచ్చు. మసాజ్ ఈ గడ్డలను తొలగించుకోవడంలో బాగా సహాయం చేస్తుంది. అండర్ వైర్ బ్రాలు ధరించడం మానుకోండి. గడ్డ క్లియర్ కాకపోతే మీ వైద్యుడిని సంప్రదించండి.

బ్రెస్ట్ లంప్​ ఎప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్​గా మారుతుంది? (When Can a Breast Lump Be Breast Cancer in Telugu?)

సాధారణ రొమ్ము గడ్డల మాదిరిగా కాకుండా రొమ్ము క్యాన్సర్ కలుగజేసే గడ్డలు ఎటువంటి నొప్పి లేకుండా ఉంటాయి. అవి ఫస్ట్ టైమ్ కనిపించినపుడు ఎర్రగా ఉండవు. బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు పైన పేర్కొన్న ఏ చికిత్సలతోనూ నయం కావు. అయినా కానీ వైద్యులకు ఏవి క్యాన్సర్​ను కలిగించే గడ్డలో ఏవి సాధారణ గడ్డలో తెలుసుకోవడం చాలా కష్టం. అరుదుగా సంభవిస్తున్నప్పటికీ మీరు ప్రెగ్నెంట్​గా ఉన్నపుడు రొమ్ము క్యాన్సర్​ కలగదని తోసిపుచ్చలేం. కాబట్టి ఏ సందర్భంలోనైనా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

చివరగా.. (Conclusion)

ప్రెగ్నెన్సీ సమయంలో మీ బాడీ అనేక మార్పులకు గురవుతుంది. డెలివరీ, మీ బిడ్డ పుట్టిన తర్వాత తనను తాను సిద్ధం చేసుకునేందుకు మార్పులు చెందుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము గడ్డలు పెద్ద ప్రమాదకరం కాదు. అవి ఈ మార్పుల్లో భాగంగానే వస్తాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మీరు రొమ్ము గడ్డలను గుర్తిస్తే ఎక్కువగా కంగారుపడాల్సిన అవసరం లేదు. కానీ సరైన చికిత్స కోసం మీరు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించాలి.

Tags:

Breast lump during pregnancy, breast lump symptoms during pregnancy in telugu, Causes of breast lump during pregnancy in telugu, how do you recognise breast lump during pregnancy in telugu, are breast lump and breast cancer same?, treatment for breast lump during pregnancy in telugu.

Lump in Breast During Pregnancy in English, Lump in Breast During Pregnancy in Bengali, Lump in Breast During Pregnancy in Tamil

గర్భిణీ తల్లుల రొమ్ముల సంరక్షణకు నమ్మకమైన తోడు

ప్రెగ్నెన్సీలో మీ రొమ్ముల సౌకర్యం, సపోర్ట్ కోసం రూపొందించిన ఉత్పత్తులతో ఈ మార్పులను సులువుగా ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

Bra Extenders (White) - Pack of 3

Bra Extenders (White) - Pack of 3

Makes Bra Comfortable | Increases Bra Band Strength

1137 Moms bought
₹99₹21955% Off
Rating
4.3
(93)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

530 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Compression Stocking Socks - S

Compression Stocking Socks - S

Compression Stockings for Varicose Veins | Reduces Swelling | Boosts Blood Circulation

460 Moms bought
₹364₹59939% Off
Rating
4.5
(31)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.